నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో ఒడిపిలవంచ గ్రామంలో గల శ్రీ భూనీళ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. శ్రీ భూనీళ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే ధూప దీప నైవేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఆలయానికి రూప దీప నైవేద్యానికి పథకాన్ని మంజూరు చేసినందుకు గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, దేవదాయ శాఖ కొండా సురేఖ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ శైలజ రామయ్య గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, పూజారి సంతోష్ ,కుమార్ ,కొత్త మూర్తి ,మూల మహిపాల్ రెడ్డి , పోచయ్య, సుబ్బారావు, స్వామి ,రాజేందర్ ,రాజబాబు ,శ్రీనివాస్, సాంబరావు ,రాకేష్ ,రంజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.



