Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనర్మెట్టలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష

నర్మెట్టలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ప్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈనెల 20 నుంచి 22 వరకు అక్కడ రైతులకు ఉపయోగపడేలా రైతు మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, వ్యవసాయ శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -