Tuesday, December 2, 2025
E-PAPER
Homeజిల్లాలుఅభివృద్ధి పనులపై మంత్రి అసంతృప్తి 

అభివృద్ధి పనులపై మంత్రి అసంతృప్తి 

- Advertisement -

– హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా ఉండాలి 
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మున్సిపాలిటీలో పనులు ప్రారంభించుకొని నెలలు గడుస్తున్న పూర్తి కాకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కాంట్రాక్టర్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు .హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా దిద్దేల పనులు జరగాలని అధికారులకు సూచించారు.

కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ రోడ్ల పెండింగ్ పనులు డిసెంబర్ 31 లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు మార్చ్ 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్దేశ్వర ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులకు టెక్నికల్ ఇష్యూ లేకుండా సమస్య పరిష్కారం చేయాలన్నారు. పద్మశాలి , గౌడ , బంజారా , మైనార్టీ , వైశ్య, విశ్వ బ్రాహ్మణ, రెడ్డి , మున్నూరు కాపు ,రజక, యాదవ కమ్యూనిటీ హాల్ లో పెండింగ్ లో ఉన్నాయని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం కావాల్సి ఉందని వాటి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి , మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ గౌడ్ ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -