బహుళ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసిన అధికారులు..
నవతెలంగాణ – సూర్యాపేట : రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 11న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 14 న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం మోతె మండలంలో ఎత్తిపోతల పథకం పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా కోదాడ పట్టణంలో రూ.5.10 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నీటి పారుదల శాఖ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు.
అలాగే, చిలుకూరు మండల కేంద్రం నుంచి జెర్రిపోతుల గూడెం వరకు రూ.8 కోట్లతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరుగనుంది. హుజుర్నగర్ నియోజకవర్గంలో రూ.2.31 కోట్లతో వేపలసింగారం–తిరుపతయ్య తండా, రూ.2.20 కోట్లతో లక్కవరం–మగ్దుంనగర్ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. హుజుర్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో నిర్మించిన ఔట్‌పేషెంట్ భవనం, రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నీటిపారుదల శాఖ భవనానికి రూ.7.99 కోట్లతో శంకుస్థాపన జరుగనుంది. గరిడేపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలెన్నో చేపట్టబడ్డాయి.
పోనుగొడు బస్ స్టాండ్ నుంచి గరిడేపల్లి మెయిన్ రోడ్ వరకు రూ.50 లక్షలు, పోనుగొడు–అప్పన్నపేట మార్గానికి రూ.3.15 కోట్లు, గానుగబండ–హనుమంతయ్యగూడెం మార్గానికి రూ.3.50 కోట్లు, గానుగబండ–పరెడ్డిగూడెం రూ.1.40 కోట్లు, కల్మలచెరువు–బొత్తలపాలెం రూ.3.50 కోట్లు, కల్మలచెరువు–గానుగబండ రూ.2.80 కోట్లు, కల్మలచెరువు–దిర్షించర్ల రూ.3.50 కోట్లు, కల్మలచెరువు–పాలకీడు సబ్‌స్టేషన్ వరకు రూ.4.20 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ జిల్లాలో సమగ్ర అభివృద్ధికి నాంది పలకనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
రేపు జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES