నవతెలంగాణ హైదరాబాద్: నీళ్లు-నిజాలపై తెలంగాణ ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి రూ. 80 వేల కోట్లు అవసరం అని చెప్పారు. అసెంబ్లీలో నీ వాటాలపై చర్చ దృష్ట్యా ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ” బీఆర్ఎస్ హయాంలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా వారు ఒక్క ఎకరాని కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లకు పైగా కావాలి. ఇందులో రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? మేం వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం” అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.
నీళ్లు-నిజాలపై ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- Advertisement -
- Advertisement -



