నవతెలంగాణ – గోవిందరావుపేట
మేడారం జాతరకు 150 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క మరియు కొండా సురేఖ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్ర పటాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ మేడారం సమ్మక్క – సారలమ్మ తల్లుల జాతరకు మొక్కులు చెల్లించడానికి దేశం నలుమూలల నుండి భారీగా భక్తులు విచేస్తారని, మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అని, అందుకే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే మేడారం జాతరలో ఇబ్బందులు లేకుండా మరమ్మత్తు పనుల కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. మేడారం జాతరను సందర్శించే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి జనవరిలో జరిగే మేడారం జాతరను విజయవంతం చేస్తాం అని అన్నారు.
అలాగే గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో మేడారం జాతరకు నిధుల కొరత ఉండేదని ప్రజా ప్రభుత్వంలో అడవి తల్లుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి ముందస్తుగా నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్ గార్లతో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
మండల కేంద్రంలో మంత్రులకు క్షీరాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES