- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ ఇవాళ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, నిధుల వినియోగం, ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు వారికి వివరణ ఇచ్చారు.
- Advertisement -



