Wednesday, January 7, 2026
E-PAPER
Homeమెదక్మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం: హుస్నాబాద్ సీఐ

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం: హుస్నాబాద్ సీఐ

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
మైనర్‌లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, ఎంఈఓ మనీలా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -