ఖాట్మాండు : నేపాల్‌లో ఆదివారం ఉదయం స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7.31 గంటలకు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.1గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ మరియు పరిశోధన సంస్థ తెలిపింది. రైతక్ ప్రాంతంలోని శంఖువాసభలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. శంఖువాసభ దేశ రాజధాని ఖాట్మాండుకు 475 కి.మీ దూరంలో ఉంది. పొరుగున ఉన్న తప్లేజంగ్ , భోజ్‌పూర్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో లామ్‌జంగ్ జిల్లాలోని బన్సర్ సమీపంలో 3.9తీవ్రతతో భూకంపం నమోదైన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక భూంకపాలు సంభవించే దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉంది.
నేపాల్‌లో స్వల్ప ప్రకంపనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



