నవతెలంగాణ – కాటారం
మండలంలోని మైనార్టీల సంక్షేమం, మసీదుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినందుకు గాను కాటారం మైనార్టీ సోదరులు కృతజ్ఞతాభివందనం తెలిపారు. ఈ సందర్భంగా కాటారం హెడ్‌క్వార్టర్‌లోని జామియా మసీదులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అజారుద్దీన్ గారి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ముస్లిం సోదరులు తెలిపారు. కాటారం జామియా మసీదుకు రూ.30 లక్షలు, చింతకాని మసీదుకు రూ.30 లక్షలు, ఇబ్రహీంపల్లి మసీదుకు రూ.30 లక్షలు మంజూరు చేయడమే కాకుండా, దేవరాంపల్లి , గంగారం, విలాసాగర్ మసీదుల అభివృద్ధికి కలిపి రూ.75 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. అదనంగా కాటారం మండల కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో షాదీఖానా (కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు.
మంథని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, శీను బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత గురువు మిర్జా సిద్ధిక్ బేగ్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వివిధ మసీదుల అధ్యక్షులు ఎస్‌కే అమీర్, మహ్మద్ అంజాత్ ఖాన్, మహ్మద్ మునీర్, మహ్మద్ అక్బర్, మహ్మద్ నయం, మహ్మద్ ఖాలిక్, మహ్మద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనార్టీ నాయకులు చోటా మియా, దాదా మియా, గౌస్, మహమూద్, రావు ఖాన్, కలీం, సలీం, హుస్సేన్ ఖాన్, చాంద్, నసీర్ తదితరులు హాజరయ్యారు.



