Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన మైనార్టీ బాలికలు

సీఎం కప్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన మైనార్టీ బాలికలు

- Advertisement -

నవతెలంగాణ – ములుగు 
ములుగు జిల్లా జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన సీఎం కప్ ములుగు జిల్లా క్రీడల్లో దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు గొప్ప ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారిని ప్రిన్సిపల్ వై. శ్రీలత ఈరోజు ప్రకటించారు.సీఎం కప్-2025-26 రెండవ ఎడిషన్‌లో ఈ నెల 9, 10 తేదీలు జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఈ బాలికలు గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించారు.

జె. ఆకాంక్ష (U-16 షాట్ పుట్) గోల్డ్, ఈ. పూజిత (U-14 రెజ్లింగ్) గోల్డ్, ఎస్కే. రేష్మ (U-16 రెజ్లింగ్) గోల్డ్ మెడల్స్ గెలిచారు. అదే విధంగా ఎస్కే. రిజ్వాన, పి. శ్రీవేణి (U-16 వాలీబాల్), పి. శ్రావ్య (U-16 కబడ్డీ), జి. సన్ (U-16 600 మీటర్ల పరుగు) ఎంపికైనారు.ఈనెల 20, 21, 23 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్‌లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వై. శ్రీలత, పీఇటి మంజు రజిని, ఉపాధ్యాయికల బృందం విద్యార్థినులను అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -