నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని మూడు మైనారిటీ గురుకుల పాఠశాల , కళాశాల లో ప్రవేశాలకు సంబంధించి గోడ పత్రిక ను రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల ఆలేరు (బాలికలు) భువనగిరి (బాలురు) చౌటుప్పల్ (బాలురు) లో ముస్లిం విద్యార్థులకు 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలు జరుగుతున్నాయి అని మూడు సంస్థల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని కాబట్టి ముస్లిం విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యాదయ్య, ఆర్.సిఓ గండ్ర శ్రీకాంత్, వివిధ జిల్లా సంక్షేమ అధికారులు నాగిరెడ్డి, శ్యాంసుందర్ , మాజీద్ లు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాల గోడ పత్రిక ఆవిష్కరణ ….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES