Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థి ముజాహిద్ అకాల మృతి

మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థి ముజాహిద్ అకాల మృతి

- Advertisement -

పరామర్శించిన ఎమ్మెల్యే తోట
నవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థి, మెక్కా గ్రామానికి చెందిన ముజాహిద్ అకాల మృతి పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డిసిసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి మద్నూర్ ప్రభుత్వాసుపత్రిని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సందర్శించారు.

మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం బాడీని తీసుకెళ్లిన సందర్భంగా అక్కడికి చేరుకుని డాక్టర్ గారితో అక్కడి పరిస్థితులను గురించి మాట్లాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే ఆసుపత్రి సందర్శనతో స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు టౌన్ అధ్యక్షులు బండి గోపి కొండ గంగాధర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -