Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeమానవిపుదీనా మజాకా!

పుదీనా మజాకా!

- Advertisement -

పుదీనా ఆకులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి. పుదీనాలో విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా నాన్‌ వెజ్‌ వంటకాలు బిర్యానీ, మటన్‌, చికెన్‌ వండేటప్పుడు పుదీనా ఆకులు వేస్తే అద్భుతమైన రుచి ఉంటుంది. వర్షకాలం వచ్చిందంటే చాలు జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యు ఎదురవుతుంటాయి.. ఈ క్రమంలో పుదీనా ఆకుల వాసన పీల్చితే ఉపశమనం లభిస్తుంది.


– ఇందులో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
– పుదీనాలో ఉండే కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పేలు , చుండ్రు సమస్యలను తొలగిస్తాయి.
– ఈ ఆకుల్లోని విటమిన్‌ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌లు సమద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.
– ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్‌, వికారం సమస్యలు దూరం అవుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad