Friday, January 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'మిరాకిల్‌'

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మిరాకిల్‌’

- Advertisement -

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై రమేష్‌ ఎగ్గిడి, శ్రీకాంత్‌ మొగదాసు, చందర్‌ గౌడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిరాకిల్‌’. ప్రభాస్‌ నిమ్మల దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. జ్యోత్స్న ఈ చిత్రానికి సహ నిర్మాత. పోరాట సన్నివేశాలతో మొదటి షెడ్యూల్‌ జరుపుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ఈనెల 22 నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. రణధీర్‌ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ హీరోయిన్‌. అక్షరనున్న సుజన మరో హీరోయిన్‌. సీనియర్‌ హీరోలు శ్రీరామ్‌, సురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయం అవుతుండగా, సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

జనార్దన్‌, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్‌, సాయిబాబా, దిల్‌ రమేష్‌, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్‌, శ్రీకాంత్‌, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్‌, ఆర్‌. కుమార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ,”సత్యా గ్యాంగ్‌, ఫైటర్‌ శివ’ చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటుకున్న ప్రభాస్‌ నిమ్మల తన మూడో చిత్రంతో ‘మిరాకిల్‌’ చేయబోతున్నారు. హెబ్బా పటేల్‌ గ్లామర్‌, సీనియర్‌ హీరోలు శ్రీరామ్‌, సురేష్‌ పోషిస్తున్న కీలక పాత్రలు, ముఖ్యంగా యాక్షన్‌ బ్లాక్స్‌ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు కానున్నాయి’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌ రెడ్డి, ఎడిటింగ్‌: విశ్వనాధ్‌, లిరిక్స్‌: రాంబాబు గోసాల, ఫైట్స్‌: శ్రీను, సహనిర్మాత: జ్యోత్స్న, నిర్మాతలు: రమేష్‌ ఎగ్గిడి – శ్రీకాంత్‌ మొగదాసు – చందర్‌ గౌడ్‌, కథ-మాటలు-స్క్రీన్‌ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్‌ నిమ్మల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -