హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్’. ఇందులో ఆయన సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ,’యాక్షన్ అడ్వెంచర్, ఫాంటసీ, డివోషన్, ఎమోషన,్ ఎలివేషన్.. అన్ని ఎలి మెంట్స్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్‌లోనే చూసే సినిమాలు ఒక ఏడాదిలో చాలా తక్కువగా వస్తుం టాయి. ఇది అందరూ థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చే సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారితో ఇది నాకు రెండో సినిమా. భవిష్యత్తులో మరిన్ని సినిమాలో కలిసి చేయాలని ఉంది. మమ్మల్ని బిలీవ్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్‌కి కృతజ్ఞతలు. సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. డైరెక్టర్, డిఓపి కార్తిక్ ఘట్టమనేని విజన్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకుల్ని కచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఐశ్వర్యతో కోలాబరేట్ అవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది’ అని తెలిపారు.
పిల్లలకు, పెద్దలకీ నచ్చే ‘మిరాయ్’
- Advertisement -
- Advertisement -