Wednesday, January 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీఎంశ్రీ నిధుల దుర్వినియోగం

పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం

- Advertisement -

– ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి : బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పీఎంశ్రీ నిధులను దుర్వినియోగం చేసిన ప్రదానోపాధ్యాయులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ (బీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కల్పదర్శి చైతన్య సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపికైన ఒక పాఠశాలకు ఐదేండ్లకు రూ.1.5 కోట్లను కేటాయిస్తున్నదని తెలిపారు. ఈ నిధులను ఆయా పాఠశాలల్లో సీనియర్‌ ఉపాధ్యాయుని సహకారంతో ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ అలా కాకుండా కొందరు ప్రధానోపాధ్యాయులు తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకుని దొంగ బిల్లులను, రిసిప్ట్‌లను పెట్టి ఆడిట్‌ చేయించుకుంటున్నారని ఆరోపించారు. నిధులు దుర్వినియోగం జరగకుండా నిరోధించేందుకు, స్టాఫ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల మేరకు అవసరాల నిమిత్తం నిధులను ప్రాధాన్యతా క్రమంలో కేటాయించి వినియోగించేలా సర్క్యులర్‌ జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -