నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు డి.అక్షిత్, ఎల్. రేవంత్ జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండంట్ బాలి రవీందర్ తెలిపారు.గత నెల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్టు తరుపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 25 నుండి 28 వరకు విశాఖపట్నంలో జరిగే 16వ జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున పాల్గొంటారన్నారు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు డి.అక్షిత్, ఎల్. రేవంత్ తో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్ ను కరెస్పాండంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయ బృందం ప్రత్యకంగా అభినందించారు.
జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES