జిల్లా కలెక్టర్ హనుమంతరావు …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మిస్ వరల్డ్ రాక ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట కార్యనిర్వాహన అధికారి వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన జిల్లాలో ప్రపంచ సుందరి మణులు పర్యటిస్తున్నందున సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ సంచాలకులు యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్రావు, డిసిపి ఆకాంక్ష్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రపంచ సుందరీమణులు పర్యాటక ప్రాంతాల సందర్శన, పర్యాటక ప్రాంతాల సందర్శన ను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆధ్యాత్మికతను సంతరించుకున్న యాదగిరిగుట్ట, ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామంగా యునెస్కో వారి గుర్తింపు పొందిన పోచంపల్లి లలో ఏర్పాట్లు పట్టిష్టంగా చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట ను ఆర్చీలతో, స్వాగత తోరణాలు తో ఆయా మార్గాలను అందంగా తీర్చిదిద్దాలని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. చేనేత వస్త్ర సాంప్రదాయానికి వేదికగా నిలిచిన పోచంపల్లి సాంస్కృతికి సాంప్రదాయాలకు పుట్టిల్లు అని, ఏమాత్రం లోటు రాకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ముందుగా మిస్ వరల్డ్ పర్యటించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు.
పోలీస్ శాఖ అధికారులు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. నీటి ఇబ్బందులు తలెత్తరాదని మున్సిపల్ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని, మరమ్మతులు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్టలో ఎగ్జిట్, ఎంట్రన్స్ వాటిపై ప్రధాన దృష్టి పెట్టాలని, ఎక్కడా లోటుపాట్లు జరగరాదన్నారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాటరీ వాహనాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు. సిబ్బందికి కేటాయించిన విధులు నిర్వహించే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. రోప్ తో పోలీస్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని పర్యటన ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పర్యటనలో గుర్తింపు పొందిన ప్రాంతాలలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని, ముందస్తుగా జెసిబి సిద్ధం చేసుకోవాలని, చెత్తాచెదారం తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకునేల సిబ్బంది అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖ, ఫైర్ స్టేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యశాఖ అధికారులు అందుబాటులో ఉండాలని యాదగిరిగుట్ట పోచంపల్లి లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించాలన్నారు. మున్సిపల్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలిపారు.పర్యటన యావత్తు విజయవంతంగా నిర్వహించేలా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, భువనగిరి, చౌటుప్పల ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి భువనగిరి, చౌటుప్పల, యాదగిరిగుట్ట ఏసీపీలు, జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES