నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ సుందరి-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు భారతీయ సంస్కృతి, వారసత్వాలను ఆస్వాదించే పర్యటనలో భాగంగా బుధవారం చారిత్రక నగరమైన ఓరుగల్లులో అడుగుపెట్టారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వరంగల్‌కు చేరుకున్న ఈ అందాల బృందానికి హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక మహిళలు సంప్రదాయ పద్ధతిలో మేళతాళాలు, బతుకమ్మలతో వారిని ఆహ్వానించారు. అనంతరం, హరిత కాకతీయ ప్రాంగణంలో స్థానిక మహిళలతో కలిసి ఈ సుందరీమణులు బతుకమ్మ ఆడారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఓరుగల్లులో బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES