- Advertisement -
తొలి రోజు నిరాశే
షూటింగ్ ప్రపంచకప్
నింగ్బో (చైనా) : ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు తొలి రోజు నిరాశపరిచారు. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి రోజు 10మీటర్ల ఎయిర్ పిస్టల్, రైఫిల్ మిక్స్‌డ్ జట్లు ఫైనల్‌కు చేరలేదు. 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పోటీపడిన భారత రెండు జట్లు అర్హత రౌండ్లో 11, 13వ స్థానాల్లో నిలిచాయి. 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో మిక్స్‌డ్ జట్లు అర్హత రౌండ్లో 14, 34వ స్థానాలతో సరిపెట్టాయి.
- Advertisement -