Saturday, October 4, 2025
E-PAPER
Homeఆటలుగురి కుదరలేదు!

గురి కుదరలేదు!

- Advertisement -

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌

నింగ్బో (చైనా) : ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. చైనాలో నింగ్బోలో జరుగుతున్న ప్రపంచకప్‌ తుది అంచె పోటీల్లో భారత షూటర్లు ఇప్పటివరకు ఏ విభాగంలోనూ ఫైనల్స్‌కు చేరుకోలేదు. శుక్రవారం జరిగిన పోటీల్లోనూ నిరాశే ఎదురైంది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 2 పొజిషన్స్‌ విభాగంలో భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత మెహులీ ఘోష్‌ అర్హత రౌండ్‌లో 583 పాయింట్లు సాధించి 23వ స్థానంతో సరిపెట్టుకుంది. మానిణి ఖౌషి అర్హత రౌండ్లో 580 పాయింట్లు స్కోరు చేసి 45వ స్థానంలో నిలిచింది. సురభి భరద్వాజ్‌ 578 పాయింట్లతో 52వ స్థానానికి పరిమితమైంది. 66 మంది షూటర్లు పోటీపడిన ఈవెంట్‌లో భారత షూటర్లు దారుణంగా విఫలమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -