Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహోర్ముజ్ జలసంధి స‌మీపంలో కార్గో నౌకపై క్షిప‌ణి దాడి

హోర్ముజ్ జలసంధి స‌మీపంలో కార్గో నౌకపై క్షిప‌ణి దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయ్ జెండా కలిగిన కార్గో నౌకపై హోర్ముజ్ జలసంధి స‌మీపంలో క్షిప‌ణి దాడి జ‌రిగింది. మయూరీ నారీ అనే ఆ థాయ్ నౌక ఇరాన్‌కు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ నౌక వెనుక భాగం నుండి దాడికి గురైందని రాయల్ థాయ్ నేవీ తెలిపింది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి కాండ్లా పోర్టుకు బయలుదేరిందని, హోర్ముజ్ వద్ద దాడికి గురి కావడంతో నౌక నుంచి దట్టమైన పొగలు వచ్చాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -