Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో రోడ్లపై మిషన్ భగీరథ గుంతలు పూడ్చివేత..!

తాడిచెర్లలో రోడ్లపై మిషన్ భగీరథ గుంతలు పూడ్చివేత..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో వాడవాడకు రోడ్లపై ఏర్పడిన మిషన్ భగీరథ పైప్లైన్  గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బండి స్వామి సోమవారం సిటీపల్లెకు ప్రారంభించారు. ఇంటింటా పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పైప్ లైన్ పనులు చేపట్టిన  గుత్తేదారులు రోడ్లకు ఇరువైపులా వేశారు. అయితే కొందరు ప్రజలు ఇంటింటా నీటి కోసం పైప్ లైన్లు వేసుకునేందుకు సిసి రోడ్లను తవ్వకాలు చేపట్టి ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. దీంతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందులకు గురి కావడంతో ఇటీవల ప్రజలు సర్పంచ్ పిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సర్పంచ్ రోడ్లపై గుంతలను ఇసుక, సిమెంట్ తో పూడ్చే పనులు చేపట్టారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో గుంతలు పూడ్చుతామని సర్పంచ్ చెప్పారు.ఇందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -