Thursday, July 17, 2025
E-PAPER
Homeఖమ్మంమిషన్ భగీరథ త్రాగు నీరు వృధా..

మిషన్ భగీరథ త్రాగు నీరు వృధా..

- Advertisement -

బీపీటీ వాల్ లాక్ తో నిలిపివేత..
5 గంటలు పాటు ప్రవాహం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నిర్వహిస్తున్న సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులలో విద్యుత్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో పట్టణం అంతా అస్తవ్యస్తంగా తయారు అవుతుంది. ఒక పక్క విద్యుత్ అంతరాయం, మరో పక్క గోతులు, గుంతలు, ఇంకో పక్క ధ్వంసం అవుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ లు. బుధవారం బస్ స్టాండ్ ఎదురుగా గల ఒక దుకాణం ముందు తాగునీటి సరఫరా పైప్ లైన్ ధ్వంసం కావడంతో ఉదయం 1 గంట నుండి సాయంత్రం 5 గంటలు వరకు నీటి వృధా అయింది. భారీ ప్రవాహంతో నీరు రహదారి పై పారుతున్న విషయాన్ని దుకాణం దారుడు పలువురికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు.

ప్రవాహం దృశ్యాన్ని ఒకరు ఫొటో తీసి నవతెలంగాణ కు పంపడంతో వాటిని వెంటనే మున్సిపల్ కమీషనర్ నాగరాజు,మిషన్ భగీరథ ఇంట్రా విభాగం డీఈఈ సలీం కు పంపగా కమీషనర్ తన సిబ్బందికి తెలిపాడు. వారేమో అది మున్సిపాల్టీ ది కాదని, మిషన్ భగీరథ వారిది అని తెలిపారు. మిషన్ భగీరథ డీఈఈ అది గ్రిడ్ విభాగం అని సంబంధిత డీఈఈ అభిషేక్ కు సమాచారం ఇచ్చారు. ఈయన తన సిబ్బందితో బ్రేక్ ప్రెజర్స్ ట్యాంక్ వాల్ లాక్ చేయించడంతో సాయంత్రం 5.30 గంటలకు ప్రవాహం నిలిచిపోయింది. నీరు అమూల్యం అని ప్రచారం చేసే ప్రభుత్వ శాఖలే ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అంటూ రోడ్ వెంట ప్రయాణీకులు, పాదచారులు వాపోయారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -