Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమిషన్‌ భగీరథ ''స్పెషల్‌ డ్రైవ్‌''

మిషన్‌ భగీరథ ”స్పెషల్‌ డ్రైవ్‌”

- Advertisement -

– ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ
– మండలాల వారీగా ప్రత్యేక బృందాలు
– ఎమ్మెల్యేల వాట్సప్‌కు మంచి నీటి సరఫరా వివరాలు
– పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్థి శాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రానున్న వేసవిలో మంచి నీటి ఎద్దడిని నివారించేందుకు పంచాయతీ రాజ్‌ గ్రామీణా భివృద్ధి శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గతేడాది పకడ్బందీ ప్రణాళికతో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా నియంత్రించిన సర్కార్‌ ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు ప్రత్యేక సమ్మర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు మండల స్థాయి బందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణా ళికను మిషన్‌ భగీరథ అధికారులు రూపొందించారు. జలాశయాల నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షించడం, ప్రభుత్వం నిర్ణయించిన కనీస డ్రా డౌన్‌ లెవల్స్‌ను పాటించేలా చర్యలు తీసుకుం టున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన, నిరంతర తాగు నీటి సరఫరా అందించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతి పదికన చర్యలు చేపడుతోంది. బల్క్‌ నీటి సరఫరాకు ఆటంకాలు కలగకుండా పైప్‌లైన్‌ లీకేజీలను గుర్తించి 24 గంటల్లో మరమ్మతులు పూర్తి చేయాలని సంబం ధిత సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నీటి శుద్ధి కేంద్రాల్లో అవసర మైన గ్యాస్‌ క్లోరిన్‌, లిక్విడ్‌ క్లోరిన్‌, పాలీ అల్యూమినియం క్లోరైడ్‌ వంటి రసాయ నాలను మూడు నెలలకు సరిపడా ముందుగానే సమకూర్చుకుంటున్నారు. ప్రతి రోజూ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి సరఫరా కొనసాగిస్తున్నారు. గ్రిడ్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంద ర్భంలో తాగునీటి సమస్య తలెత్తకుండా స్థానిక వనరులు, చేతి పంపులు, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు, బావులు పూర్తిస్థాయిలో వినియోగించేలా గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అవసరమైన చోట మర మ్మతులు పూర్తి చేసి వాటిని అందు బాటు లోకి తెస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ప్రతి రోజూ మంచి నీటి సరఫరా వివరాలను వాట్సప్‌ ద్వారా తెలియజేయనున్నారు. నీటి సరఫరా, చేప ట్టాల్సిన చర్యలకు సంబందించి వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ఏలాంటి సమ స్యలు రాకుండా జాగ్రత్తలు తీసు కుంటారు.

రోజు వారీ సమీక్ష
మంచి నీటి బల్క్‌ సరఫరాపై మండల స్థాయిలో రోజువారీగా పర్యవేక్షించనున్నారు. ఉదయం 9.30 గంటలకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి సమస్యలు తలెత్తిన గ్రామాలపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించేందుకు మిషన్‌ భగీరథ అధికారులు చర్యలు చేపట్టారు. తాగునీటికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. అలాగే 24/7 టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1916 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రజలకు వేసవిలోనూ ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.

మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పైప్‌ లైన్లు లేని గ్రామాలు, నల్లా కనెక్షన్లు లేని ఇండ్లకు తాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసు కుంటున్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, తండాలు, ఇతర మారుమూల ప్రాంత గ్రామాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయను న్నారు. జిల్లా కేంద్రంలో డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేసి తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినప్పుడు పరిష్క రించేందుకు ప్రత్యా మ్నాయ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. అవర మైన చోట ట్యాంకర్లను సైతం అందుబాటులోకి తేనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -