- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
గంట్లకుంట గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మెట్లు శిథిలావస్థకు చేరాయి. వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు గురి కావడంతో మెట్లు ఒక్కొక్కటిగా కూలి పోతున్నాయి. ఎప్పుడు ఏ మెట్టు కూలుతుందోనని ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మెట్లు కూలిపోవడంతో గత కొన్ని నెలలుగా ట్యాంక్ క్లోరినేషన్ చేయడం లేదు. సంబధిత అధికారులు వెంటనే స్పందించి, మిషన్ భగిరథ వాటర్ ట్యాంక్ కు మరమ్మతులు చేయించాలి. ట్యాంక్ శుభ్రం చేయించి, శుద్ది జలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -