Saturday, January 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మిషన్ భగీరథ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి..

మిషన్ భగీరథ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందించే మిషన్ భగీరథ నీటిని ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మిషన్ భగీరథజిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశం సూచించారు. గురువారం  జన్నారం మండలంలోని కలమడుగు,బంగారు తండా, సోనాపూర్ తండా గొండు గూడా తదితర ప్రాంతాల్లో పర్యటించి, భగీరథ నీటి సరఫరా పై ఆరా తీశారు. నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటిని వృధా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. సరఫరాలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏఈఈ నందన్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -