Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిషన్ భగీరథ నీరు సౌర్యం..!

మిషన్ భగీరథ నీరు సౌర్యం..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గత ప్రభుత్వం ఇంటింటా పరిశుద్ధమైన తాగునీరు అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంపై సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో నీరు సౌర్యానికి గురివుతున్న పరిస్థితి. ప్రజల దప్పిక తీర్చడానికి పైప్ లైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు గత కొద్ది రోజులుగా సౌర్యానికి గురివుతున్నట్లుగా తెలిసిన సంబంధించిన అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మల్లారం ఇప్పలవద్ద గుట్టపై వాటర్ ట్యాoకర్ లో డంపింగ్ చేసిన నీరు మల్లారం, తాడిచర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల గ్రామాలకు పైప్ లైన్ల ద్వారా ఇంటింటా చేరుతోంది. అయితే మల్లారం చెరువు తాడిచర్ల ఎర్రకుంట మధ్యలో పైప్ లైన్ జాయింట్ వద్ద నట్లు లూజు చేసి నీటిని పత్తి,వరి పంటల కోసం సౌర్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తాగడానికి అందించే నీరు ఇలా సౌర్యానికి గురి కావడంతో ప్రజలకు సరిపడా నీరు అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసి నీరు సౌర్యం చేస్తున్న వారిపై  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -