ప్లాంట్ వద్ద మృతదేహంతో కార్మికుల ఆందోళన
నవతెలంగాణ- కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు మిషన్ భగీరథ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కార్మికుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని, వెంటనే జీతాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతూ.. రెండ్రోజుల నుంచి మండలంలోని పాలేరు గ్రామం వద్ద మిషన్ భగీరథ ప్లాంట్ కార్మికులు సంబంధిత కంపెనీకి సమ్మె నోటీసు ఇచ్చి, సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా సభలో పాల్గొన్న చందనబోయిన గాంధీ(35) ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి, ఇంటికెళ్లి ఉరేసుకున్నట్టు తోటి కార్మికులు కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాంధీ మృతికి ఎల్‌అండ్‌టీ కంపెనీనే బాధ్యత వహించాలని మృతదేహంతో మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు.
జీతాలు రావటం లేదని…మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES