Friday, January 2, 2026
E-PAPER
Homeఆటలుకెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌

కెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌

- Advertisement -

పాట్‌ కమిన్స్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌కు చోటు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు

కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా) : 2026 ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. గాయాలతో ఇబ్బంది పడుతూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు తపిస్తున్న స్టార్‌ పేసర్లు పాట్‌ కమిన్స్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌లను సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకుంది. యాషెస్‌ సిరీస్‌ తొలి నాలుగు టెస్టుల్లో పాట్‌ కమిన్స్‌ ఒక్క మ్యాచ్‌లోనే ఆడగా.. హేజిల్‌వుడ్‌ పూర్తిగా దూరమయ్యాడు. భారత్‌, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. వరల్డ్‌కప్‌ ఆరంభంలోపు ప్రాథమిక జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది.

దీంతో ఫిట్‌నెస్‌ లేకపోయినా పాట్‌ కమిన్స్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌లు జట్టులోకి వచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఫిట్‌నెస్‌ పరీక్షలో ఈ ఇద్దరు పేసర్లు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే… తుది జట్టులో ఉంటారని సమాచారం. పాట్‌ కమిన్స్‌, హేజిల్‌వుడ్‌తో పాటు గాయంతో బిగ్‌బాష్‌ లీగ్‌కు దూరమైన టిమ్‌ డెవిడ్‌ సైతం జట్టులోకి ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్‌ మార్ష్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్‌ దశ గేమ్స్‌ను శ్రీలంకలో ఆడనుంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆ తర్వాత వరుసగా జింబాబ్వే, శ్రీలంక, ఓమన్‌తో ఆడనుంది. వరల్డ్‌కప్‌ ముంగిట పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. పాక్‌ పర్యటన అనంతరం ఆసీస్‌ జట్టు వరల్డ్‌కప్‌కు రానుంది.

టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు :
మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జేవియర్‌ బార్ట్‌లెట్‌, కూపర్‌ కొనొల్లీ, పాట్‌ కమిన్స్‌, టిమ్‌ డెవిడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, నాథన్‌ ఎలిస్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, మాట్‌ కుహ్నేమాన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడం జంపా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -