Thursday, January 22, 2026
E-PAPER
Homeఆటలుటాప్‌లోకి మిఛెల్‌

టాప్‌లోకి మిఛెల్‌

- Advertisement -

కోహ్లీకి 2వ ర్యాంక్‌
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారీ మిఛెల్‌ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటర్ల జాబితాలో డారీ మిఛెల్‌ 845రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారీ మిఛెల్‌ రెండు సెంచరీలతో రాణించాడు. దీంతో అతడి అగ్రస్థానానికి ఎగబాకగా.. ఇప్పటివరకు అగ్రస్థానంలో భారత్‌కు చెందిన విరాట్‌ కోహ్లి 2వ స్థానంలో నిలిచాడు.

కివీస్‌పై చివరి వన్డేలో శతకంతో మెరిసినా.. విరాట్‌ ఖాతాలో కేవలం 795రేటింగ్‌ పాయింట్లు మాత్రమే ఉండడంతో అతడు 2వ స్థానానికే పరిమితమయ్యాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 9 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మిఛెల్‌ నిలిచాడు. కేవలం 54 ఇన్సింగ్స్‌ల్లో అతను 9 సెంచరీలు కొట్టాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మిచెల్‌ 352 పరుగులు చేశాడు. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో మిఛెల్‌ అగ్రస్థానంలో నిలువడం ఇది రెండోసారి మాత్రమే. ఇక రోహిత్‌ శర్మ(757), శుభ్‌మన్‌ గిల్‌(723) 4, 5 స్థానాలో నిలువగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జడ్రాన్‌(764) 3వ స్థానంలో నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -