సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ బడ్జెట్ మిశ్రమంగా ఉందని, ప్రజలు ఆశించిన ప్రయోజనాలు లేవని అన్నారు. ప్రత్యేకంగా పెన్షన్లను రెట్టింపు చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గీత కార్మికులు, యాదవులు, ముదిరాజులు, చేనేత కార్మికులు వంటి వృత్తి వర్గాల సమస్యలు బడ్జెట్‌లో ప్రస్తావనకు రాకపోవడం ఆందోళన కలిగించిందన్నారు. విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే 8శాతం మాత్రమే కేటాయించారని, ఆరోగ్య రంగానికి కూడా 4 శాతం మాత్రమే కేటాయించడం సరిపోదని తెలిపారు.
అయితే ‘ఇందిరమ్మ బీమా’ పథకం కింద ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా అందించడం కొంతమేర సానుకూల అంశమని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధిపై బడ్జెట్ స్పష్టమైన దిశానిర్దేశం చేయలేకపోయిందని విమర్శించారు. అలాగే, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు. బడ్జెట్ కేవలం అసెంబ్లీ ప్రసంగాలకే పరిమితం కాకుండా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలని, కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని సీపీఐ తరఫున ప్రభుత్వం కోరుతున్నామని నెల్లికంటి సత్యం తెలిపారు.
మిశ్రమ బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



