– ఫైర్ సేఫ్టీ డీజీకి ఆప్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అగ్ని ప్రమాద ఘటన జరిగిన నేపథ్యంలో మియాపూర్ నారాయణ పాఠశాలను వెంటనే తనిఖీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో నాయకులు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 10న ఆ పాఠశాలలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుందని వారు తెలిపారు. ఆ ఘటనలో 800 మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో తక్షణమే తనిఖీ చేసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ ఉందా? ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా?, అత్యవసర నిష్క్రమణ మార్గాలున్నాయా? సెల్లార్‌లో రసాయన, వ్యర్థ పదార్థాలు నిల్వలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. డీజీని కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు రాజ్, దర్శనం రమేశ్, కొడంగల్ శ్రీనివాస్ ఉన్నారు.
మియాపూర్ నారాయణ పాఠశాలను తనిఖీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



