- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మియాపూర్‌కు చెందిన జయసూర్య (23) తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు కాళ్లకు గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తూ ప్రమాదానికి గురైన అతడు, శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేసి తాను సురక్షితంగా ఉన్నానని తెలిపాడు. కొడుకు బతికి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -



