- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆయన పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంత ఆయన మాట్లాడుత.. ఐదేళ్ల లోపు బాల బాలికలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -