Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – నవాబ్ పేట్
మండల కేంద్రములోని బాలాజీ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని,వారి పంటలకు సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు తమ పంటలను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధరకు విక్రయించి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. స్థానిక అధికారులు రైతులకు సమయానికి చెల్లింపులు చేయాలని సూచిస్తూ, కొనుగోలు కేంద్రం కార్యకలాపాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్,గిర్దావారు గాయత్రి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు,వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్,నాయకులు వెంకటేష్ గౌడ్, నవాజ్ రెడ్డి ,రమేష్ గౌడ్, నీలకంఠం, రవిందర్ రెడ్డి భూపాల్ రెడ్డి , ప్రతాప్ గోపాల్ గౌడ్, కృష్ణ గౌడ్ వాసు యాదవ్, మెండె అంజయ్య, కోట్ల రాజేష్, కొల్లి నర్సింహులు, చిర్ప సత్యం, అమ్మాపూర్ నర్సింహులు, ఆనంద్, హమీద్ మహెక్ తానెం సుధాకర్ , ప్రభాకర్, జగన్మోహన్ రెడ్డి , ఖాజా మైనోద్దీన్, రాజశేఖర్, యాదయ్య బంక వెంకటయ్య బంక ఆంజనేయులు కుమార్ సురెందర్, సురేష్, నరేష్ పీఏసీఎస్ డైరెక్టర్ లు ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -