Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మిలాద్ -ఉన్ - నబీ వేడుకల్లో ఎమ్మెల్యే 

మిలాద్ -ఉన్ – నబీ వేడుకల్లో ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాద్- ఉన్ – నబీ వేడుకల్లో శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లోని మహమ్మదీయ మజీదులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మిలాద్ – ఉన్ – నబీ ప్రత్యేకతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త 1500 జయంతినే గొప్పగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనటి కృష్ణయ్య వనపర్తి మార్కెట్ డైరెక్టర్ లతీఫ్, ముస్లిం నాయకులు రఫిక్, మన్సూర్ , ఇర్ఫాన్, అస్లాం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad