నవతెలంగాణ – మోపాల్
ఆదివారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాల సిరికొండ విద్యార్థులకు నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పోర్ట్స్ దుస్తులను విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మోటిక్ చార్జీలు పెంచామని అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు, నాణ్యమైన ఆహారం పెడుతున్నామని, ముఖ్యంగా శారీరక దృఢత్వం ఉండడానికి స్పోర్ట్స్, గేమ్స్లలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామని అన్నారు.
రాష్ట్రస్థాయి మరియు నేషనల్ స్థాయిలో ఆటలు ఆడి రాష్ట్రానికి, జిల్లాకు, గిరిజన పాఠశాలకు, నిజామాబాద్ రూరల్ నియోజవర్గానికి పేరు తేవాలని అన్నారు. సిరికొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వివిధ స్పోర్ట్స్ మరియు గేమ్స్ రాష్ట్ర స్థాయి వరకు వెళ్లారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు భోజరాం, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు సంజీవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, రాజేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES