నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పోలికమ్మ, భారతీయల మనవడు నిహాన్ డోలారోహణ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. పిల్లల జీవితాల్లో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయన్నారు. అలాంటి రోజులను తల్లిదండ్రులు ఈ విధంగా వేడుక చేసుకోవడం ద్వారా అవి భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్నారు. చిన్నారి నిహాన్ డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన తల్లిదండ్రులు దినేష్, సుమలతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శారద, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



