కైవసం చేసుకున్న యాకయ్య గౌడ్
నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి వద్ద ఉన్న లడ్డు వేలం రూ.25 వేలం పలికింది. శుక్రవారం గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలం నిర్వహించారు. లడ్డు వేలం పాటలో మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగురి యాకయ్య గౌడ్ కైవసం చేసుకోవడంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గణపతి వద్ద ఉన్న లడ్డును మొలుగూరి యాకయ్య గౌడ్ కు అందజేశారు. మండల కేంద్రంలో గల గుడివాడ చౌరస్తాలో ఏర్పాటుచేసిన గుడివాడ విగ్నేశ్వరుని వద్ద ఉన్న లడ్డువేలాన్ని 18 వేలకు పాలకుర్తి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమల్ల సోమేశ్వర్ కైవసం చేసుకున్నాడని గుడివాడ విగ్నేశ్వరుని నిర్వహణ కమిటీ అధ్యక్షులు చారగుండ్ల శివ శనివారం తెలిపారు.
.