నవతెలంగాణ – కమ్మర్ పల్లి : పదవ తరగతి వార్షిక ఫలితాల్లో 589 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచిన నందగిరి వర్షిత్ ను రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. మండలంలోని ఉప్లూర్ లో బుధవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఆయనకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన వర్షిత్ ను పరిచయం చేశారు. గ్రామానికి చెందిన విద్యార్థి 589 మార్కులతో మండల టాపర్ గా, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం పట్ల వర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్షిత్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, విద్యార్థి వర్షిత్ తండ్రి నందగిరి వెంకటేష్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మండల టాపర్ ను అభినందించిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES