నవతెలంగాణ – మద్నూర్
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మద్నూర్ గ్రామ సర్పంచిగా గెలుపొందిన ఉషా సంతోష్ మేస్త్రి ఆయన తల్లిదండ్రులు పార్వతి పుల్లాజీ జ్ఞాపకార్థం తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రజల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ నిర్మించారు. నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్ కు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు సోమవారం గణతంత్ర వేడుకలకు హాజరైన సందర్భంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజల కోసం మంచి సౌకర్యాలతో తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో వెయిటింగ్ హాల్ నిర్మించిన సంతోష్ మేస్త్రికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే తో పాటు మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ కూడా నిర్మాణ దాత అయిన సంతోష్ మేస్త్రికి ప్రత్యేకంగా అభినందించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్చ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్చ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుచ గ్రామస్తులుచ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



