నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడైన శివయ్యను ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సన్మానించి ఆశీస్సులు అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది.
సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



