నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
సద్దుల బతుకమ్మ సందర్బంగా నగరంలో ఉన్న బొడ్డెమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ ను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశేష స్థానం ఉందన్నారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ప్రకృతిని పార్వతి దేవిగా పూజిస్తూ ఆనందోత్సవాల మధ్య ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా నిమజ్జనం చేయడం అనవయితీగా వస్తుందని అన్నారు.
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఇందూర్ నగరంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో, ఘాట్ వద్ద పరిశుభ్రత, కాంతివంతమైన విద్యుత్ వెలుగులు,త్రాగునిరు మరియు ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో చిన్న పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా, భద్రతగా జరుపుకోవాలని సూచిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లను సమయానుకూలంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DE సుదర్శన్ రెడ్డి, AE ఇనాయత్ అలీ,మున్సిపల్ సిబ్బంది తాజా మాజీ కార్పొరేటర్లు ఇల్లేందుల మమతా, ప్రభాకర్ గారు, వెల్డింగ్ నారాయణ గారు, బీజేపీ నాయకులు చిరంజీవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఘాట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES