నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైనా ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్, ఎన్ఎం) లో భాగంగా ప్రదర్శన క్షేత్రం కొరకుయాసంగి పంట కోసం సబ్సిడీపై శనగ ఎన్ బిఈజీ 47 వెరైటీ విత్తనాలురైతులకు పంపిణీ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని అన్నారు రైతుల అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
డెమో సంచులు 270 వచ్చాయని సబ్సిడీ పోను రూ.1500 రూపాయలు అలాగే జనరల్ సంచులు360వచ్చాయని సబ్సిడీపోను సంచి ధర రూ. 1250 రూపాయలకు రైతులకు అందజేయడం జరుగుతుందని AO రచన తెలిపారు. అలాగే 8 కల్యాణ లక్ష్మి చెక్కులను 9 షాదిముబారాక్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, తాసిల్దార్ శ్రీలత ,ఎఓ రచన,ఆర్ఐ నారాయణ పటేల్ ,ఎఇఓలు ఋషికేష్, ప్రవీణ్, సందేశ్,రాణి, బిజెపి మండల అధ్యక్షులు కోరి పోతన్న, నర్సగౌడ్ , సతీష్ రెడ్డి,రమేష్ ,జీవన్,సప్పటోళ్ల పోతన్న,ముత్యం రెడ్డి, మోహన్ యాదవ్ ,భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
శనగ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES