Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే రూ.2 కోట్ల విరాళం

రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే రూ.2 కోట్ల విరాళం

- Advertisement -

సీఎంకు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ

తన నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.2 కోట్ల విరాళాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అందజేశారు. తన కుమారుడు సాయిప్రసన్న, కోడలు వెన్నెల రిసెప్షన్‌ ఘనంగా చేయాలని ఎమ్మెల్యే భావించారు. అయితే, రిసెప్షన్‌కు అంత ఖర్చు వద్దంటూ చెప్పి.. ఆ డబ్బులను రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని కొడుకు, కోడలు కోరారు. దాంతో ఎమ్మెల్యే గురువారం కుటుంబ సభ్యులతో వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రూ.2కోట్లు అందజేశారు. నియోజవర్గంలో లక్షమంది రైతులకు బస్తా యూరియా చొప్పున ఉచితంగా అందజేయాలని ముఖ్యమంత్రిని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారి వెంట నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి, బీఎల్‌అర్‌ సతీమణి మాధవి, కుమారుడు బత్తుల సాయి, ఈశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -