ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆకస్మికంగా సందర్శించి వరద బాధితులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ.. సమయానుసారంగా భోజన సదుపాయం, ఇతరత్రా సౌకర్యాలు వెంటనే కల్పించి వారికి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. పునరావాస బాధితులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మీ వెన్నంటే ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి భరోసా కల్పించారు. వారి వెంట తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, సహకార సొసైటీ చైర్మన్ రామ్ చందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాసు బాబుతో పాటు తదితరులు ఉన్నారు.