Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంలో ఎమ్మెల్యే విఫలం..

రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంలో ఎమ్మెల్యే విఫలం..

- Advertisement -

బీఆర్ఎస్ యువజన విభాగం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: భువనగిరి పట్టణంలోని జగదేవపూర్ రోడ్ లోని బ్రిడ్జి, ఆర్ కె హాస్పిటల్ ముందు రోడ్డుపై గత కొంతకాలంగా గుంతలమయమైంది. ఈ క్రమంలో గత నెల రోజుల క్రింద భువనగిరి శాసనసభ్యులు ఈ రోడ్డును పరిశీలించి,  మరమ్మతులు చేపిస్తానని చెప్పి పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో  సిమెంటు కంకరతో గుంతలు మూసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కాజా అజముద్దీన్, పార్టీ యువజన విభాగం పట్టణ యూత్ అధ్యక్షులు పెంట నితీష్ లు మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం గడుస్తున్నా.. భువనగిరి శాసనసభ్యులకు ఇలాంటి ముఖ్యమైన పనులను చేయడం మానేసి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి చేసిన పనులకు మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ తిరగడమే సరిపోతుందని విమర్శించారు. ఇకనైనా పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వంలో మునుముందు ఇలాంటి కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి నాగారం సూరజ్, ఎండి ముజీబ్,రామకృష్ణ, వేముల కృష్ణ,మనీష్, పోకలశివ,సైదులు,బురాన్,శ్రవణ్, విక్రాంత్,వసీమ, వినోద్, రొయ్యల పవన్, అమిర్,  నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad