- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నమ్మకంతో మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉషా సంతోష్ మేస్త్రి సర్పంచ్ గా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆ నూతన సర్పంచ్ దంపతులను శాలువలతో ఘనంగా సన్మానించారు. నా నమ్మకాన్ని నిలబెట్టి, గెలిచినందుకు దంపతులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు. మద్నూర్ గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని ఉషా సంతోష్ మేస్త్రికి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



